కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘సెయాన్ ‘ రెగ్యులర్ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు నుండి మదురై పరిసర ప్రాంతాలలో సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన షెడ్యూల్‌ను చిత్రీకరిస్తున్నారు. ‘అమరన్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ నటిస్తున్న రెండవ చిత్రమిది. షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా మేకర్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో శివకార్తికేయన్ గుబురు గడ్డంతో, ముఖంపై మంటల నీడలతో అత్యంత రగ్గడ్ మరియు ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ షాక్ ఇచ్చారు. లార్డ్ మురుగన్ మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన రూరల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతోంది.
ఇందులో ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది.కోలీవుడ్ లో ఆమె కు ఇదే మొదటి సినిమా.’థాయ్ కిళవి’ ఫేమ్ శివకుమార్ మురుగేశన్ డైరెక్ట్ చేస్తుండగా రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్స్ నిర్మిస్తుంది.
బ్రేక్స్ లేకుండా సింగిల్ స్ట్రెచ్‌లో ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. శివకార్తికేయన్ కెరీర్‌లోనే ఇదొక బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ కాబోతోందని ఇన్ సైడ్ టాక్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























