వారణాసి షూట్ అప్డేట్

New Shooting Schedule Underway for Varanasi

ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వారణాసి’ నేటి నుండి కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్, వేసవి సెలవుల అనంతరం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లలో తదుపరి చిత్రీకరణ జరుపుకోనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ షెడ్యూల్‌లో మహేష్ బాబుతో పాటు కథానాయిక ప్రియాంక చోప్రా కూడా పాల్గొననున్నారు. వీరిద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర బృందం కెన్యా, యూరప్ వంటి విదేశీ ప్రాంతాలకు వెళ్లనున్నట్లు సమాచారం. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు.

కీరవాణి సంగీతం అందిస్తుండగా సుమారు 1000కోట్లకుపైగా బడ్జెట్ తో కేఎల్ నారాయణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.