సూర్య గారితో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు – ఆర్.జే. బాలాజీ

Making a Film with Suriya Was Beyond My Dreams says R. J. Balaji

సూర్య మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలని సృష్టించాయి. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిలీజ్ అవుతుంది. మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్ లో హీరో కార్తి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత సుప్రియా యార్లగడ్డ పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డైరెక్టర్ ఆర్.జే. బాలాజీ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సూర్య గారి సినిమాలను తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ సినిమాను కూడా అన్ని భాషల ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా అద్భుతంగా తీర్చిదిద్దాం. దర్శకుడిగా నేను సూర్య గారితో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సూర్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఏముంటుందో ట్రైలర్‌లో కొంత మాత్రమే చూపించాం. సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్‌లు ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్ మాస్ మసాలా ఫిల్మ్. అభిమానులు చూడాలనుకునే సూర్య సార్‌ను ఈ సినిమాలో చూపించాం. సినిమాను సెలబ్రేట్ చేసుకునే ప్రేక్షకుల కోసం ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమాతో సూర్య గారికి ఒక బ్లాక్‌బస్టర్ ఇస్తానని నేను మాట ఇచ్చాను. ఖచ్చితంగా ఈ సినిమా మా నమ్మకాన్ని నిలబెడుతుంది. ఇది ఒక ఇంటెలిజెంట్ కమర్షియల్ ఫిల్మ్. సుప్రియ గారికి ధన్యవాదాలు. తెలుగు డైలాగ్స్‌ను రాకేందు మౌళి గారు అద్భుతంగా రాశారు. సాయి అభ్యంకర్ చాలా మంచి సంగీతం అందించారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.