సూర్య మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘వీరభద్రుడు’. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలని సృష్టించాయి. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రిలీజ్ అవుతుంది. మే 14న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో హీరో కార్తి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నిర్మాత సుప్రియా యార్లగడ్డ పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చాలా అదృష్టవంతుడిగా భావిస్తాను. నాకు తెలుగు అంత బాగా రాకపోవచ్చు… కానీ తెలుగు వారి మనసు మాత్రం నాకు బాగా తెలుసు. సుప్రియ గారితో మాకు ఎప్పటినుంచో చాలా మంచి స్నేహం ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాం. ఇంత అద్భుతమైన ప్రమోషన్స్, రిలీజ్ ప్లానింగ్ చేస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాతో ప్రేక్షకులు ఖచ్చితంగా చాలా సంతృప్తి పొందుతారు. రాకేందు మౌళి గారు చాలా చక్కని మాటలు రాశారు. రామజోగయ్య శాస్త్రి గారికి, శ్యామ్ గారికి థ్యాంక్యూ. చాలా మంచి పాటలు రాశారు. వాటికి మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది.
ఆర్.జే. బాలాజీ గారి జర్నీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన మల్టీ టాలెంటెడ్. ఈ కథను చాలా సిన్సియర్‌గా రాశారు… అంతే సిన్సియర్‌గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ చాలా మంచి ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం పూర్తి స్థాయి థియేటర్ మాస్ మసాలా మూమెంట్స్‌తో ఉంటుంది. చాలా మంచి హ్యూమర్, ఫన్ ఉంటాయి… ఇది నా ప్రామిస్. మే 14న ఈ సినిమా విడుదల అవుతోంది. ఈ సినిమాను నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఆర్.జే. బాలాజీ, జీకే విష్ణు కలిసి నన్ను చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ మధ్యకాలంలో వచ్చిన నా సినిమాలన్నింటికంటే చాలా డిఫరెంట్‌గా చూపించారు. త్రిషతో 23 ఏళ్ల తర్వాత కలిసి పనిచేసిన సినిమా ఇది. తను చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. విక్రమ్ గారు అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు డిజైన్ చేశారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ దీన్ని చాలా స్పెషల్‌గా ట్రీట్ చేసి పనిచేశారు. ఆ సిన్సియర్ ఎఫర్ట్ మీ అందరికీ సినిమాలో కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఎంటర్‌టైనర్. మీ ఆశీస్సులు, ప్రేమ మాకు కావాలి. మీ అందరి సపోర్ట్‌కి, అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























