ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వారణాసి’ నేటి నుండి కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్, వేసవి సెలవుల అనంతరం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లలో తదుపరి చిత్రీకరణ జరుపుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటు కథానాయిక ప్రియాంక చోప్రా కూడా పాల్గొననున్నారు. వీరిద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర బృందం కెన్యా, యూరప్ వంటి విదేశీ ప్రాంతాలకు వెళ్లనున్నట్లు సమాచారం. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు.
కీరవాణి సంగీతం అందిస్తుండగా సుమారు 1000కోట్లకుపైగా బడ్జెట్ తో కేఎల్ నారాయణ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























