భోగిలో మందారంగా డింపుల్ హయతి

bhogi features dimple hayathi as mandaram

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ నుండి డింపుల్ హయతి ఫస్ట్ లుక్ నేడు విడుదలైంది. ఈ సినిమాలో డింపుల్ హయతి ‘మందారం’ అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. విడుదలైన పోస్టర్‌లో ఆమె ఎరుపు రంగు చీర కట్టుకుని, చేతిలో తాటిపాక విసనకర్ర పట్టుకుని ఒక పాతకాలపు (వింటేజ్) సెటప్‌లో కూర్చుని కనిపిస్తోంది. ఇందులో డింపుల్ ఏజ్డ్ రోల్ లో కనిపించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మందారం పాత్రను “ప్రపంచం కోరుకున్న అందం..కానీ ఎవరూ అర్థం చేసుకోలేని ఆత్మ” అంటూ చిత్రబృందం పరిచయం చేసింది. ఆమె ఈ సినిమాలో ఎంతో ధైర్యవంతురాలైన, తన నిబంధనలకు అనుగుణంగా బతికే ఒక మొండి స్వభావం గల మహిళగా కనిపిస్తుంది.

1960ల కాలంలో తెలంగాణ మరియు మహారాష్ట్ర సరిహద్దుల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ మరో కథానాయికగా నటిస్తోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా చిత్రం ఆగస్టు 28, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.