రౌడీ జనార్దన నుండి విజయ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ 

Vijay Devarakonda Gets a Special Birthday Poster from Rowdy Janardhana

విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘రౌడీ జనార్దన’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ గుబురు గడ్డం, మెలితిప్పిన మీసాలతో చాలా రఫ్ అండ్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. వర్షంలో తడుస్తూ, చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్న ఆయన ఆహార్యం సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. “ప్రపంచంతో పోరాడే వ్యక్తి… ప్రేమకు మాత్రమే లొంగిపోతాడు” అనే క్యాప్షన్ సినిమా నేపథ్యాన్ని సూచిస్తోంది.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, క్రిస్టో జేవియర్ సంగీతాన్ని అందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా 2026 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.