లెనిన్ నుండి భాగ్యశ్రీ బోర్సే పోస్టర్ రిలీజ్

Bhagyashri Borse Poster from Lenin Released

అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం నుంచి హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. నేడు ఆమె పుట్టినరోజు కావడంతో, చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ పోస్టర్‌లో ఆమె లుక్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో ఆమె , మహారాజు వేషధారణలో, మీసకట్టుతో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. సాధారణంగా హీరోయిన్ల బర్త్ డే పోస్టర్లు గ్లామరస్‌గా ఉంటాయని ఆశించే ప్రేక్షకులకు, చిత్ర యూనిట్ ఈ వైవిధ్యమైన లుక్‌తో సర్ప్రైజ్ ఇచ్చింది. ఈసినిమాలో ఆమె ‘భారతి’ అనే పాత్రలో కనిపించనుండగా ఈ గెటప్ వెనుక ఏదైనా నాటక రంగ నేపథ్యం ఉందా లేదా కథలో ఏదైనా కీలక మలుపు ఉందా అనేది ఆసక్తికరంగా మారింది.

మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా పల్లెటూరి నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా, భాగ్యశ్రీ బోర్సే లుక్ ఆ అంచనాలను మరింత పెంచుతోంది. ఈ చిత్రం జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.