ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఎల్ఐకె’ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. ఈరోజునుండి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది. భవిష్యత్తులో సాంకేతికత మరియు యాప్స్ మనుషుల సంబంధాలను ఎలా శాసిస్తాయి అనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. ఇందులో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రల్లో నటించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. థియేటర్లలో మిశ్రమ స్పందన పొందిన ఈ సినిమా, నేటి నుంచి తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే ‘ఎల్ఐకె’ మాత్రం విడుదలైన 26 రోజుల్లోనే డిజిటల్ వేదికపైకి రావడం విశేషం.ఇక ఈసినిమాతో ప్రదీప్ రంగనాథన్ విజయాలకు బ్రేక్ పడింది. వరసగా 100కోట్ల క్లబ్ లో చేరి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లను అందుకున్న ప్రదీప్ కు ఎల్ఐకె షాక్ ఇచ్చింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























