పెద్ది మీ అందరి హృదయాలకు దగ్గరగా ఉంటుంది – బుచ్చిబాబు సానా

Peddi Will Touch Everyone’s Hearts Says Buchi Babu Sana

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిత్ర బృందం ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్‌డేట్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జూన్ ప్రారంభంలో రిలీజ్ కావడం వల్ల సమ్మర్ హాలిడేస్ చివరి దశలో థియేటర్స్ లో ప్రేక్షక ఆదరణ అందుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైం. అకడమిక్ సీజన్ మొదలయ్యే ముందు దేశ వ్యాప్తంగా మంచి ఫుట్‌ఫాల్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక పెద్ది రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ ప్రెస్ మీట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్బంగా మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సుకుమార్ గారికి థాంక్యూ. ‘పెద్ది’ ఏప్రిల్ 30న రానందుకు క్షమించండి. జూన్ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి.(నవ్వుతూ) ఇది ఒక కమర్షియల్ ఎమోషనల్ రైడ్. మీ అందరి హృదయాలకు దగ్గరగా ఉంటుంది. పెద్ది ని మీ హృదయం నుంచి తీసేయడం అంత ఈజీ కాదు. చరణ్ సార్‌పై నా ప్రేమ జూన్ 4న మీరు చూస్తారు. ఈ అవకాశం ఇచ్చిన రామ్ చరణ్ గారికి థాంక్యూ సో మచ్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.