మైసా యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

Mysaa Kicks Off Action-Packed Shoot Schedule

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’తో తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడిన పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఇంటెన్స్ గ్లింప్స్‌తో మంచి బజ్ సృష్టించింది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా కేరళలో 15 రోజుల బ్రూటల్ యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది. కేచా ఖంపక్దీ మాస్టర్ హై వోల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. రష్మిక తో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ యాక్షన్ షెడ్యూల్ సినిమాలో మేజర్ హైలెట్ గా ఉండబోతుంది.  

‘మైసా’లో రష్మిక ఒక గోండ్ గిరిజన అమ్మాయిగా కనిపిస్తోంది. ఈ పాత్రకు ఎమోషనల్ డెప్త్ తో పాటు శారీరక దృఢత్వం కూడా అవసరం. ఇందుకోసం రష్మిక అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో బ్యాంకాక్‌కు వెళ్లి కఠినమైన స్టంట్, కాంబాట్ ట్రైనింగ్‌ తీసుకున్నారు. రోజుకు దాదాపు ఎనిమిది గంటల పాటు అడ్వాన్స్‌డ్ స్టంట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకున్నారు.

రష్మిక మైసాలో ఇప్పటివరకు చూడని ఇంటెన్స్, ఎక్స్‌ప్లోసివ్ అవతార్‌లో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సినిమాటోగ్రఫీని శ్రేయాస్ పి కృష్ణ నిర్వహిస్తుండగా, జేక్స్ బీజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. రష్మిక మందన్న, ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.