గాయపడ్డ సింహం నుండి ప్రేమకి పులిహోర సాంగ్ రిలీజ్

Premaki Pulihora Lyrical song from Gaayapadda Simham out now

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఇప్పటికే ఎంటర్టైనింగ్ ట్రైజర్, పాటలతో స్ట్రాంగ్ బజ్ సృష్టించింది. ఇప్పుడు మేకర్స్ ఫోర్త్ సింగిల్ ప్రేమకి పులిహోర రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టిపికల్ లవ్ సాంగ్‌లా కాకుండా, ‘ప్రేమకి పులిహోర’ మోడరన్ లవ్ లో ఉండే అటుపోటులు, సరదా, అన్నీ అంశాలను సరదాగా ప్రజెంట్ చేస్తోంది. తనకు నచ్చిన అమ్మాయిని ఆకట్టుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు, ఆ ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న అడ్డంకులు అన్నీ ఈ పాటలో హ్యూమరస్‌గా, రిలేటబుల్‌గా ఆకట్టుకున్నాయి.

స్వీకర్ అగస్తి ఈ పాటకు లైట్, బ్రీజీ ఫీల్‌తో కూడిన ట్యూన్ అందించారు. మెలోడీకి అర్బన్ టచ్ జోడించి, స్టైలిష్ మ్యూజిక్‌తో ఈ పాటను క్యాచీగా తీర్చిదిద్దారు. ఆయన రాసిన పదాలు నేటి ప్రేమలో ఉండే కన్ఫ్యూజన్, ఎగ్జైట్మెంట్‌ను చక్కగా చూపించాయి. అనురాగ్ కులకర్ణి వోకల్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.

తరుణ్ భాస్కర్, మానస చౌదరి మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ. వారి మధ్య జరిగే క్యూట్, సరదా క్షణాలు, స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ అన్నీ కలిసి ఈ పాటను మరింత ఎంజాయబుల్‌గా మార్చాయి.

ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషదం ఎడిటింగ్‌, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైన్‌, సూర్య ప్రకాష్ జ్యోసుల కథను అందిస్తున్నారు. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.