సందీప్ కిషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు పవర్ ఫుల్ టైటిల్

Sundeep Kishan’s Next Project Power Peta Announced

యంగ్ హీరో సందీప్ కిషన్ తన కెరీర్‌లో 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పవర్ పేట’ అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా టైటిల్ పోస్టర్ చాలా ఇంటెన్సివ్‌గా ఉంది. రక్తంతో తడిసిన చదరంగం బోర్డు, విరిగిన పావులు మరియు నలిగిపోయిన గులాబీ పువ్వుతో కూడిన ఈ పోస్టర్ ‘ప్రేమ, గౌరవం, రాజకీయం’ అనే థీమ్స్‌ను సూచిస్తోంది. ఇది ఒక పవర్‌ఫుల్ మరియు ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, మధి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు. సందీప్ కిషన్ ఈ సినిమా కోసం ఒక ప్రత్యేకమైన మేకోవర్‌లో కనిపించనున్నారు. రితిక్ నాయక్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. నిజానికి ఈసినిమాను నితిన్ తో చేయాలనుకున్నాడు కృష్ణ చైతన్య.నితిన్ కూడా ముందు ఇంట్రెస్ట్ చూపించిన తరువాత ఏమైందో కానీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఇక ఆ తరువాత ఈ కథ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి సందీప్ కిషన్ దగ్గరుకు చేరింది. స్టోరీ నచ్చడంతో సందీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.