ఎన్టీఆర్ నీల్ : బీస్ట్ లుక్ లో ఎన్టీఆర్

Jr. NTR’s Beast Mode Look from NTR–Neel Goes Viral

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఎన్టీఆర్ నీల్ (వర్కింగ్ టైటిల్) కోసం తారక్ తన బాడీని పూర్తిగా మార్చుకుని, మునుపెన్నడూ లేని విధంగా ఒక ‘బీస్ట్ మోడ్’లో కనిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పవర్‌ఫుల్ ఫోటోను షేర్ చేశారు. జిమ్‌లో కండలు తిరిగిన దేహంతో, బ్యాక్ డబుల్ బైసెప్స్ పోజ్‌లో ఉన్న ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. “Built… Not Bought” అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో ఉన్న ఈ లుక్, ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో క్లియర్ హింట్ ఇస్తోంది.

ఇప్పటికే జోర్డాన్‌తో పాటు హైదరాబాద్‌లోని శంషాబాద్ పరిసరాల్లో కీలక యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ కోసం భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది.

ఈ పీరియడికల్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తొలుత టోవినో థామస్ పేరు వినిపించినా, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన తప్పుకున్నారు. ప్రస్తుతం ఈ పవర్‌ఫుల్ విలన్ రోల్ కోసం ఓ బాలీవుడ్ స్టార్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం.

మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈఏడాది చివర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ఈసినిమా నుండి అప్డేట్ రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.