ఇంత అద్భుతమైన సక్సెస్ చేసిన ఆడియన్స్ కృతజ్ఞతలు – అడివి శేష్

Adivi Sesh Thanks Audience for the Dacoit Success

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ‘డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, స్వప్నదత్, నందిని రెడ్డి పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. గతవారం నుంచి నేను చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను. 2013లో ‘కిస్’ అనే ఒక సినిమా చేశాను. సినిమా కొన్ని అనివార్య కారణాలవల్ల సరిగ్గా రాలేదు. అప్పటినుంచి ఒకటి డిసైడ్ అయ్యాను. ఎప్పటికైనా సరే పట్టుదలతో గట్టిగా పట్టుకొని సినిమా చేయాలి, మనసుతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పటినుంచి జర్నీ అలానే సాగింది. మెల్లమెల్లగా క్రెడిబిలిటీ వచ్చింది. నా బిగ్గెస్ట్ ఓపెనర్ ఇది. నేను ఇంట్లో పెద్ద కొడుకుని. పెద్ద కొడుకు మీద అన్ని బాధ్యతలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. నా మైండ్ లో ఆడియన్స్ నా ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేయాలి నేను సెట్ లో అన్ని పనులు చేస్తాను. దీనికి కారణం మన ఫ్యామిలీని చూసుకోవాలి.

ఒకటి నమ్ముకున్న తర్వాత దానికోసం కష్టపడి పనిచేయడం నాకు తెలుసు. ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ చెప్పాలనిపించింది. అది కూడా ఒక జెన్యూన్ గా కొత్తగా చెప్పాలనిపించింది. జీవితంలో ఉన్న చిన్న విషయాలతో ఈ కథను అల్లడం జరిగింది. మనకు జీవితంలో చిన్న చిన్న విషయాలే గుర్తుంటాయి. ఆ ప్రేమ కథలో కూడా అలా గుర్తుండిపోయే సన్నివేశాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన సినిమా ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ సినిమా కోసం అందరిని కష్టపెట్టాను. డైరెక్టర్ శానిల్ తో కలిసి ఒక విజన్ అనుకున్నాను. ఈ సినిమా నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. ఈ సినిమాని తీయడం చాలా కష్టం, 45 డిగ్రీల వేడిలో పర్వతాల పైన షూట్ చేశాను అలాగే డ్యాం రోడ్డు పైన చిత్రీకరించాము. సుప్రియ గారు ఈ సినిమాకి కర్త కర్మ క్రియతనే. ఇండస్ట్రీలో కూడా తను ఒక బలం. ఈరోజు సెలబ్రేషన్ లో కనిపిస్తున్న ప్రతి నవ్వు వెనక సుప్రియ గారు ఉన్నారు. నేను కలిసి పనిచేసిన బెస్ట్ ప్రొడ్యూసర్స్ సుప్రియ గారు. మృణాల్ ఈ సినిమాకి మరో బలం. ఈ సినిమా కోసం అన్ని కలిసి వచ్చాయి. ఈ సినిమా కోసం చాలా చాలెంజెస్ ఎదుర్కొన్నాం. చాలా జెన్యూన్ గా ప్రయత్నించాము. సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ ఇచ్చారు. ఇంత అద్భుతమైన సక్సెస్ చేసిన ఆడియన్స్ కృతజ్ఞతలు. నాకు చాలా మంది ఏదైనా టైటిల్ ఇస్తామని చెప్తుంటారు. నేను టైటిల్స్ ని పెద్దగా పట్టించుకోను. నేను కోరుకునే ట్యాగ్ ఒకటే.. గుడ్ సినిమా శేష్. థాంక్యూ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.