అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్ మొదటి వీకెండ్లో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను సాధించింది. పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే భారీ మైలురాళ్లను అందుకుంది.ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లో (వీకెండ్) ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించి అడివి శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతోంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం $900k డాలర్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ సినిమా స్టడీగా రాణిస్తోంది. ఆదివారం నాటి వసూళ్లతో కలిపి రెండు రాష్ట్రాల్లో దాదాపు రూ. 18 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
ఉత్తరాదిలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. హిందీ వెర్షన్ మూడు రోజుల్లో సుమారు రూ. 5 కోట్ల గ్రాస్ సాధించింది.అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం, మాజీ ప్రేమికుల మధ్య సాగే వైవిధ్యమైన యాక్షన్ డ్రామా కావడంతో యువతను మరియు మాస్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటోంది. సోమవారం కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉండటంతో ఈ సినిమా లాంగ్ రన్లో మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























