డెకాయిట్ ట్రైలర్ రిలీజ్

Trailer of Dacoit Out Now

అడివి శేష్ , మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ : ఒక ప్రేమ కథ. టీజర్ తో ఈసినిమాకు హైప్ రాగా తాజాగా ట్రైలర్ ను విడుదలచేశారు. ఇక ట్రైలర్ ఆ అంచనాలను మరింతగా పెంచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ట్రైలర్ చూస్తుంటే, సినిమా, పవర్‌ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో లవ్ స్టోరీ గా తెరక్కుతుందని స్పష్టమవుతోంది. అడివి శేష్ మునుపెన్నడూ లేని విధంగా ఒక మాస్ అండ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తుండగా, మృణాల్ ఠాకూర్ తన నటనతో మరియు అందంతో ట్రైలర్‌కు నిండుదనాన్ని తీసుకొచ్చారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రతి ఫ్రేమ్‌లోనూ అద్భుతంగా పండింది. ముఖ్యంగా ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ మరియు కలర్ గ్రేడింగ్ సినిమాను హాలీవుడ్ స్థాయిలో చూపిస్తున్నాయి.

నేపథ్య సంగీతం ట్రైలర్‌లోని ఎమోషన్స్‌ను మరియు యాక్షన్ సీన్స్‌ను బాగా ఎలివేట్ చేశాయి. అడివి శేష్ స్వయంగా ఈ చిత్రానికి సహా-రచయితగా వ్యవహరించడం విశేషం. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, బలమైన కథాంశం మరియు మనసుకు హత్తుకునే ప్రేమకథ ఈ చిత్రంలో ఉన్నట్లు కనిపిస్తోంది. తెలుగు మరియు హిందీ భాషల్లో భారీ ఎత్తున రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అడివి శేష్‌కు మరో మైలురాయిగా నిలిచేలా ఉంది.

ఈ చిత్రానికి అడివి శేష్‌కు అత్యంత సన్నిహితుడు మరియు గతంలో ‘క్షణం’, ‘గూఢచారి’ వంటి చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన షానీల్ డియో దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ భారీ ప్రాజెక్టును నిర్మించారు.

భీమ్స్ సిసిరోలియో పాటలు అందించగా, జ్ఞాని నేపథ్య సంగీతం అందిస్తున్నాడు. ఎ. విజయ్ మరియు కింగ్ సోలమన్ వంటి హేమాహేమీలు ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీని అందించారు. ప్రతి విభాగంలోనూ అనుభవజ్ఞులైన నిపుణులు పని చేయడంతో ‘డెకాయిట్’ బాక్సాఫీస్ వద్ద షూర్ షాట్ హిట్ అనిపించుకునేలా వుంది.ఈనెల 10న డెకాయిట్ థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.