హీరో శర్వానంద్ నటించిన బైకర్ రేపు విడుదలకానుండగా సినిమా మీద వున్న నమ్మకంతో ఈరోజు సాయంత్రం నుండే ప్రీమియర్లు ప్లాన్ చేశారు. ఈ షోలకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హైదరాబాద్ లో దాదాపు అన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి.రిలీజ్ కు ముందే సూపర్ బజ్ వుండడంతో సినిమా చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.హిట్ టాక్ వస్తే బైకర్ సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టుకోనుంది. సినిమా విజయంపై బైకర్ టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ‘మోటోక్రాస్ రేసింగ్’ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో పెయిడ్ ప్రీమియర్ షోలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తుంది.
ఈ చిత్రంలో శర్వానంద్ ఒక ప్రొఫెషనల్ బైక్ రేసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన శారీరకంగా ఎంతో శ్రమించి దాదాపు 23 కిలోల బరువు తగ్గడం సినిమా పట్ల ఆయనకున్న అంకితభావాన్ని చాటుతోంది. సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఈ సినిమాలో శర్వానంద్ తండ్రిగా కీలకమైన పాత్రలో నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు మరియు తండ్రీకొడుకుల మధ్య ఉండే సంఘర్షణ సినిమాకు ప్రధాన బలం. మాళవిక నాయర్ కథానాయికగా నటించగా, అతుల్ కుల్కర్ణి మరియు బ్రహ్మాజీ ఇతర ముఖ్య పాత్రల్లో మెరిశారు.
సాంకేతికంగా ఈ సినిమాను దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దారు. యువి క్రియేషన్స్ (వంశీ, ప్రమోద్) ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ముఖ్యంగా ఇండోనేషియా వంటి విదేశీ లొకేషన్లలో అంతర్జాతీయ రేసర్ల పర్యవేక్షణలో చిత్రీకరించిన రేసింగ్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నాయి. జిబ్రాన్ సంగీతం అందించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























