మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘పెద్ది’ విడుదల తేదీపై వస్తున్న రూమర్లకు తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఏప్రిల్ 30 నుండి జూన్ నెలకు వాయిదా పడిందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ స్వయంగా స్పందిస్తూ సినిమా వాయిదా పడటం లేదని క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిహారిక కొణిదెల నిర్మించిన ‘రాకాస’ సినిమా ప్రమోషన్స్ లో రామ్ చరణ్, సరదాగా మాట్లాడుతూ.. “పెద్ది సినిమా లేట్ అవ్వడం లేదు, ఈ విషయాన్ని బాగా ప్రమోట్ చేయండి” అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ చిత్రం ముందే ప్రకటించినట్లుగా ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావడం ఖాయమని తేలిపోయింది.
అయితే, షూటింగ్ ఇంకా పూర్తి కాలేదనే వార్తలు అభిమానుల్లో కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, కేవలం ఒక పాట మరియు కొన్ని చిన్న సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. దీని కోసం కేవలం పది రోజుల కాల్ షీట్స్ సరిపోతాయని, అందుకే సినిమాను సకాలంలో విడుదల చేయగలమనే ధీమాతో చిత్ర యూనిట్ ఉంది. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఎడిటింగ్ కూడా సమాంతరంగా జరుగుతుండటంతో ఏప్రిల్ 30 లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని మేకర్స్ భావిస్తున్నారు.
దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఒక గ్రామీణ క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ ఒక రెజ్లర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.అయితే షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉండడంతో , రామ్ చరణ్ స్వయంగా భరోసా ఇచ్చినప్పటికీ తో ‘పెద్ది’ అనుకున్న డేట్ కి రావడం అనుమానమే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























