భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక కావ్యం ‘రామాయణ’ నుండి ఎదురుచూస్తున్న అధికారిక గ్లింప్స్ నేడు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలైంది. దర్శకుడు నితీష్ తివారీ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేడు విడుదలైన గ్లింప్స్ సుమారు 2 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఉండి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇందులో రణ్‌బీర్ కపూర్ ‘శ్రీరాముడి’ పాత్రలో కనిపించిన విధానం అద్భుతంగా ఉంది. రాముడి ఎంట్రీ సీన్ మరియు ఆ విజువల్ గ్రాండియర్ ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విజేతలు హ్యాన్స్ జిమ్మెర్ మరియు ఎ.ఆర్. రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందించడం విశేషం. గ్లింప్స్ చివరలో రావణుడిగా కన్నడ స్టార్ యష్ వాయిస్ మరియు ఆయన లుక్ కి సంబంధించిన చిన్న హింట్ కూడా ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది.
ఇందులో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ , సీతాదేవి గా సాయి పల్లవి, రావణుడిగా యష్, హనుమంతుడగా సన్నీ డియోల్,లక్ష్మణుడుగా రవి దూబే నటిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్ కోసం ‘DNEG’ సంస్థ పనిచేస్తోంది.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు నమిత్ మల్హోత్రా నేతృత్వంలోని ‘ప్రైమ్ ఫోకస్’ మరియు ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో నటుడు యష్ కేవలం రావణుడి పాత్రకే పరిమితం కాకుండా, ఒక సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం. దాదాపు 1000కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈసినిమా విజువల్ వండర్ గా నిలిచిపోనుంది.
ఈ భారీ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగంఈ ఏడాది దీపావళి 2026 కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రెండవ భాగం దీపావళికి విడుదల కాబోతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























