తమిళ నటుడు కరుణాస్ కుమారుడు కెన్ కరుణాస్ హీరోగా, దర్శకుడిగా పరిచయమైన ‘యూత్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ వసూళ్లతో దూసుకుపోతోంది. కేవలం ₹6 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, విడుదలైన తమిళంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.ఇక గత వారం తెలుగులో విడుదలకాగా నాలుగు రోజుల్లో ఈసినిమా 3.73కోట్ల వసూళ్లతో హిట్ దిశగా పయనిస్తోంది.ఈసినిమాను E2C టాకీస్ తెలుగులో విడుదలచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో కెన్ కరుణాస్ ‘ప్రవీణ్’ అనే స్కూల్ స్టూడెంట్ పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచారు. ఆయన సరసన ముగ్గురు యువ కథానాయికలు అనీష్మా అనిల్ కుమార్ (గంగవల్లి), మీనాక్షి దినేష్ (ప్రేషిక), మరియు ప్రియాన్సీ యాదవ్ (సోనల్) నటించారు. ఇక ఈ చిత్రంలో హీరో తల్లిదండ్రులుగా సీనియర్ నటులు సూరజ్ వెంజరమూడు, దేవదర్శిని తమ నటనతో సినిమాకు ప్రాణం పోశారు. వీరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి.
సాంకేతికంగా కూడా ఈ సినిమా చాలా బలంగా నిలిచింది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. విక్కీ ఛాయాగ్రహణం, నాష్ ఎడిటింగ్ సినిమాకు మంచి విజువల్ క్వాలిటీని ఇచ్చాయి. 2016 నాటి కాలేజీ రోజులను గుర్తు చేస్తూ రూపొందిన ఈ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామాను ‘కెన్ & గ్యాంగ్’ బృందం ఎంతో సహజంగా తెరకెక్కించింది.
ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత, ఏప్రిల్ చివర్లో ఈ చిత్రం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























