అందుకే ఆ సినిమానుండి తప్పుకున్నా – టొవినో థామస్

Tovino Thomas Breaks Silence on Leaving the ntr neel project

మ్యాన్ మాసెస్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ ఎన్టీఆర్ నీల్ చిత్రం నుండి మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ తప్పుకున్నారు. నేడు హైదరాబాద్‌లో తన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని అధికారికంగా స్పష్టం చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత కొంతకాలంగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు సోదరుడిగా లేదా విలన్‌గా టొవినో నటిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే, డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే తాను ఈ ప్రాజెక్ట్ చేయడం లేదని ఆయన తెలిపారు. “తెలుగులో ఒక పెద్ద సినిమా పూర్తి కావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. కానీ మలయాళంలో మేము మూడు నెలల్లోనే సినిమా పూర్తి చేస్తాం. ఒకే సినిమా కోసం ఏడాది కాలం కేటాయిస్తే నా మిగిలిన మలయాళ ప్రాజెక్టులు ఆగిపోతాయి. అందుకే భారమైన హృదయంతో ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది” అని టొవినో వివరించారు.

సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలు (‘కేజీఎఫ్’, ‘సలార్’) డార్క్ థీమ్‌లో ఉంటాయి. కానీ ‘డ్రాగన్’ కోసం ఆయన తన శైలిని మార్చి, పూర్తి కలర్ ఫుల్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

కన్నడ నటి రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ భారీ పాన్-ఇండియా చిత్రాన్ని జూన్ 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.