‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం నుండి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో రూపొందిన మొదటి పాట ‘గురుతుందా’ విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. “తొలి ప్రేమేం తోపు కాదే అమ్మడు.. నీ లైఫ్ ఆపలేదే ఎన్నడూ” అంటూ సాగే ఈ పాటలోని అర్థవంతమైన సాహిత్యం, మెలోడీ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించిన క్లాసిక్ మెలోడీకి ప్రముఖ గాయకుడు హరి చరణ్ తన గొంతుతో ప్రాణం పోశారు.అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటలోని “తొలి ప్రేమేం తోపు కాదే” అనే లైన్ ప్రస్తుత యూత్ కి బాగా కనెక్ట్ అవుతోంది గత జ్ఞాపకాల నుండి బయటపడి కొత్త జీవితం వైపు అడుగులు వేయాలనే సందేశం ఇందులో ఉంది . విజువల్స్‌లో కిరణ్ అబ్బవరం మరియు శ్రీ గౌరి ప్రియ మధ్య కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా కనిపిస్తోంది.
చెన్నై బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా వస్తున్న ఈసినిమాలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటిస్తుండగా రవి నంబూరి డైరెక్ట్ చేస్తున్నాడు. సాయి రాజేష్ మరియు SKN నిర్మిస్తున్నారు. మాస్ మూవీ మేకర్స్ మరియు అమృత ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























