స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’. ఇక ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ దాదాపు పూర్తి కావడంతో, సమంత తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పనులను అధికారికంగా ప్రారంభించారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో సమంత ఒక మధ్యతరగతి గృహిణిగా, కుటుంబం కోసం పోరాడే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె కెరీర్‌లో ఇది ఒక విభిన్నమైన మరియు హృదయానికి హత్తుకునే పాత్ర అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఇతర ముఖ్య పాత్రల్లో రావు రమేష్, సీనియర్ నటి లక్ష్మి మరియు దేవదర్శిని కనిపించనున్నారు.సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. మే 15న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఈ చిత్రానికి దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ బేబీ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో మా ఇంటి బంగారం పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































