సితారలో నితిన్ మరోసారి 

Nithiin Finalizes His Next Project

తమ్ముడు తరువాత చాలా గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ ఎట్టకేలకు తన నెక్స్ట్ మూవీని లాక్ చేశారు. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా తన నెక్స్ట్ మూవీని అఫిషియల్ గా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ 43వ ప్రాజెక్టును నితిన్‌తో ప్రకటించింది. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇద్దరు కొత్త దర్శకులు ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నారు.స్టైలిష్ లుక్‌లో ఉన్న నితిన్ పోస్టర్‌ను విడుదల చేస్తూ, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

ఇక ఈసినిమా కాకుండా నితిన్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘ఆయ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో నితిన్ ఒక వినోదాత్మక చిత్రం చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించనున్నారు.త్వరలోనే ఈసినిమా గురించి అధికారిక ప్రకటన రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.