వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ బరి గ్రాండ్ లాంచ్

Varun Tej’s New Film bhari Launched in a Grand Way

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘బరి’ నేడు శనివారం ఘనంగా ప్రారంభమైంది. అన్నయ్య హీరోగా, చెల్లి నిర్మాతగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ పై అప్పుడే మంచి అంచనాలు మొదలయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక హైదరాబాద్‌లో జరిగిన ఈసినిమా ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు.

ఈ చిత్రానికి ‘బరి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. “ఇక బరిలో దూకుదామా?” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ తేజ్ వాలీబాల్ ప్లేయర్‌గా ఒక సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.

‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న యదు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు.నిహారిక కొణిదెల తన సొంత బ్యానర్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పై ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.