వెంకటేష్ , కళ్యాణ్ రామ్ , అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ లోకి జీ స్టూడియోస్

Zee Studios Teams Up for Venkatesh Daggubati – Nandamuri Kalyan Ram – Anil Ravipudi Movie

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మిషన్ అనిల్ రావిపూడి కొలాబరేషన్ లో విజయవంతమైన నిర్మాణ సంస్థ ‘షైన్ స్క్రీన్స్’ ఇటీవల ఒక భారీ సినిమాటిక్ కొలాబరేషన్ ను ప్రకటించింది. భారీ పండుగ వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా (#VenkyAnil5 & #NkrAR2), 2027 సంక్రాంతికి ఘనంగా విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. ఈ బ్యానర్ ఇప్పటికే ‘భగవంత్ కేసరి’ రీజినల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి వరుస విజయాలను అందించింది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, జీ స్టూడియో సహ-నిర్మాతగా చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

F2, F3, సంక్రాంతికి వస్తున్నం వంటి బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌ల తర్వాత ఇది అనిల్ రావిపూడి వెంకటేష్‌తో కలిసి చేస్తున్న ఐదవ చిత్రం కావడం విశేషం. ఇటివలే MSGలో అతిధి పాత్రలో అదరగొట్టారు వెంకటేష్. అలాగే సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్‌తో ఇది అనిల్ రావిపూడి రెండవ చిత్రం. ఈ కొత్త చిత్రం, దర్శకుడు అనిల్ రావిపూడితో షైన్ స్క్రీన్స్ సంస్థకు మూడో కొలాబరేషన్ నిలుస్తూ, వీరి విజయవంతమైన అనుబంధం మరింత బలపడింది.

విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి క్లీన్ గా, అన్ని వయస్సుల ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో కొత్త ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. హాస్యం, భావోద్వేగాలు, పండగ వాతావరణం అన్నీ కలిసి ఈ సినిమాను ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ట్రీట్‌గా తీర్చిదిద్దుతున్నారు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను అనిల్ రవిపూడి అంచనాలకు తగ్గట్టుగా రూపొందిస్తున్నారు. త్వరలో గ్రాండ్ పూజా కార్యక్రమంతో సినిమాను ప్రారంభించి, ఆ తర్వాత టైటిల్‌తో పాటు ఇతర వివరాలను వెల్లడించనున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం సంక్రాంతి 2027కు రానున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్లలో ఒకటిగా నిలుస్తోంది. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్, స్టార్ క్యాస్ట్, స్ట్రాంగ్ ప్రొడక్షన్ బ్యాకింగ్ అన్నీ కలిసి ఈ సినిమాను మరొక మరిచిపోలేని సంక్రాంతి ఎక్స్ పీరియన్స్ గా నిలవనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.