బ్యాడ్ బాయ్ కార్తిక్ రిలీజ్ డేట్ లాక్

Release Date Confirmed for ‘Bad Boy Karthik

చాలా గ్యాప్ తరువాత హీరో నాగ శౌర్య అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి నిర్మాణంలో, నూతన దర్శకుడు రామ్ దేశిన (రమేష్) దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ఇప్పటికే భారీ బజ్‌ను సృష్టించాయి. విడుదలైన ప్రతి పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. హై-వోల్టేజ్ సన్నివేశాలు మాస్ యాటిట్యూడ్‌తో నిండిన ఈ సినిమా టీజర్, చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేసవిలో విడుదలయ్యే భారీ చిత్రాలలో ఒకటిగా ‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో ఫైర్ బ్యాక్ డ్రాప్, ఒక చేతిలో ఆయుధం పట్టుకుని, మరో పిడికిలి బిగించి నాగ శౌర్య కనిపించడం, ఆయన వెనుక, పండుగ ఊరేగింపులలో కనిపించే భారీ అమ్మవారి విగ్రహం దర్శనమివ్వడం క్యురియాసిటీని పెంచింది.

‘బ్యాడ్ బాయ్ కార్తిక్’ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులనుజీ స్టూడియోస్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం సినిమాల డీల్స్ కష్టంగా మారిన ఈ సమయంలో ఈ సినిమా కోసం ఇంత త్వరగా డీల్ క్లోజ్ కావడం, సినిమా కంటెంట్‌పై ఉన్న బలమైన నమ్మకాన్ని చూపిస్తోంది. జీ స్టూడియోస్ తో ఈ భాగస్వామ్యం సినిమా క్రెడిబిలిటీని పెంచడమే కాకుండా, రిలీజ్‌కు ముందే మంచి బజ్‌ను కూడా తీసుకువచ్చింది.

ఈ సినిమాలో నాగ శౌర్య సరసన విధి కథానాయికగా నటిస్తుండగా, శ్రీదేవి విజయకుమార్ ఆయన సోదరి పాత్రలో కనిపించనున్నారు. సముద్రఖని, నరేష్ వి.కె. కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.