ఆది సాయి కుమార్ ఈగో రాజా టైటిల్ పోస్టర్ విడుదల

Aadi Saikumar’s Ego Raja Title Poster Released

సక్సెస్ ఫుల్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా ఎస్‌జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జి.సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘ఈగో రాజా’, ఈ మూవీని గురు శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆదితో పాటుగా నటుడు సతీష్‌ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపు దిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌‌కు సంబంధించిన అప్డేట్‌ను ఉగాది సందర్భంగా రివీల్ చేశారు. యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్‌తో రాబోతోన్న ఈ మూవీ అద్భుతంగా ఉండబోతోందని టీం నమ్మకంగా చెబుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ ఆది సాయి కుమార్‌ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చుట్టూ రౌడీలు, ఒంటిపై గాయాలు, రక్తం మరకలు చూస్తుంటే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండేట్టుగానే కనిపిస్తున్నాయి. ఇక ఆది లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా, అగ్రెస్సివ్‌గా ఉంది. చేతిలో సిగరెట్ పెట్టుకున్న తీరు, ఆది కాస్టూమ్స్ ఇలా అన్నీ కూడా ప్రామిసింగ్‌గా ఉన్నాయి.

కె. ఎస్. రవికుమార్ వద్ద పనిచేసిన దర్శకుడు గురు శరవణన్ ‘కూగల్ కుట్టప్ప’తో మంచి విజయాన్ని అందుకున్నారు. తన మూడో చిత్రమైన ‘ఈగో రాజా’తో శరవణన్ హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

‘శంబాల’ లాంటి బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న ఆది సాయి కుమార్ ఈ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. ‘కంజూరింగ్ కన్నప్పన్’, ‘సట్టం ఎన్ కైయిల్’ ఫేమ్ సతీష్ ఈ హై-ఆక్టేన్ యాక్షన్ చిత్రంలో ఓ పాత్రను పోషిస్తున్నారు.

మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, గిబ్రాన్ సంగీతం, దురైరాజ్ ఆర్ట్ మేనేజ్‌మెంట్‌తో, అద్భుతమైన సాంకేతిక బృందం సహకారంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తి స్థాయిలో జరుగుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.