కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్న సిద్దు

New Director on Board for Siddhu Jonnalagadda’s Next

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన కెరీర్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఉగాది పర్వదినం సందర్భంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో సిద్ధు తన కొత్త సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార బ్యానర్ లో ఇది 42వ సినిమా. ఈ చిత్రాన్ని ఒక బిగ్ స్కేల్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. సిద్ధు మార్క్ కామెడీతో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ ఉండటం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.కొత్త దర్శకుడు అనిల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ శ్రీకరా స్టూడియోస్ బ్యానర్ల పై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్ నుండి ప్రారంభం కానుంది.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సిద్ధు ఇంతకుముందు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ‘డిజె టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ లతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందుకున్నారు. ఇప్పుడు అదే బ్యానర్‌లో ఒక ఫాంటసీ ఎంటర్‌టైనర్‌తో రాబోతుండటంతో హ్యాట్రిక్ హిట్ ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.