గోదారి గట్టుపైన బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్  

Bangaru Bomma from Godari Gattupaina out now

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ఫస్ట్ రెండు సింగిల్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది   ఈ జోష్ ని కొనసాగిస్తూ, మేకర్స్ ఇప్పుడు మూడో సింగిల్ ‘బంగారు బొమ్మ’ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంగీత దర్శకుడు నాగ వంశీ సాఫ్ట్ బీట్స్, సాఫ్ట్  స్ట్రింగ్స్, హృదయాన్ని హత్తుకునే ఆర్కెస్ట్రేషన్‌తో విన్టేజ్ మ్యాజిక్‌ను ఇచ్చారు. వింటేజ్ మాధుర్యాన్ని గుర్తు చేసే ఈ  సాంగ్ స్వచ్ఛమైన అనుభూతిని అందిస్తుంది.

లిరిక్ రైటర్ బాలాజీ రాసిన సాహిత్యం హీరో ఫీలింగ్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. హీరోయిన్ ని ప్రేమగా “బంగారు బొమ్మ” అని పిలుస్తూ, ఆమెను చూసినా, ఆమె గురించి ఆలోచించినా తనకు అశాంతి కలుగుతుందని చెప్పడం అలరిస్తోంది. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన మనసును ఈ పాట అద్భుతంగా ప్రతిబింబిస్తుంది.

పాట మొత్తం సాఫ్ట్, రొమాంటిక్, ఫన్ ఎక్స్ ప్రెషన్ తో సాగుతుంది. హీరోయిన్ కనిపించే ప్రతి క్షణంలో కలిగే ఎమోషన్స్, గుండెల్లో తేలే భావనలు, మిగిలిపోయే జ్ఞాపకాలు.. అన్ని కలిపి యూత్ లవ్ ని గుర్తు చేసే డ్రీమీ మూడ్‌ను సృష్టిస్తాయి.

ఈ పాటకు అసలైన ప్రాణం లెజెండరీ గాయకులు ఎస్.పీ. చరణ్,  కె.ఎస్. చిత్ర అందించిన మధుర వోకల్స్. వారి హార్మనీ పాటకు గొప్ప మాధుర్యాన్ని, భావోద్వేగాలని  జోడిస్తుంది.

స్క్రీన్ పై సుమంత్ ప్రభాస్,  నిధి ప్రదీప్ మధ్య కనిపించే క్యూట్ కెమిస్ట్రీ ఈ పాటను మరింత అందంగా తీర్చిదిద్దుతుంది. ఫస్ట్ లవ్ స్పార్క్‌ను సెలబ్రేట్ చేసే ఈ పాట అందరినీ ఆకట్టుకుంది.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్ డిజైన్‌ను ప్రవాల్య, ఎడిటింగ్‌ను అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైన్‌ను నాగార్జున తల్లపల్లి నిర్వహిస్తున్నారు. “బంగారు బొమ్మ” పాట విడుదలతో గోదారి గట్టుపైన సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.