గీతా ఫిలిం చేతికి దీవాన

geetha film distribution deewana rights

హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దీవాన’ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీ సంస్థ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయబోతున్నారు. ఒక అందమైన మరియు ఇంటెన్స్ ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాను శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కిస్తున్నారు. ఈ వేసవి కానుకగా ‘దీవాన’ చిత్రాన్ని థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గతంలో ‘శుభం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి, ఈ సినిమాతో మరో విజయాన్ని అందుకుంటారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అర్హ మీడియా మరియు వీ స్టూడియోస్ బ్యానర్‌లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన స్టోరీ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఈశ్వర్ చంద్ సంగీతాన్ని సమకూర్చారు. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ రంగంలోకి దిగడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.