డెకాయిట్ షూట్ కంప్లీట్

Dacoit Wraps Up Shooting

అడివి శేష్ హీరోగా నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ షూటింగ్ నిన్నటి తో పూర్తయింది.దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి అనుకున్న తేదీకి విడుదలచేయనున్నారు. మొదట ఈ సినిమాను మార్చి 19న ఉగాది సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్ కి కుదరకపోవడంతో ఏప్రిల్ 10, 2026 న థియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. టాలీవుడ్ లో తనకు ఇదే మొదటి సినిమా. అలాగే ప్రకాష్ రాజ్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

షనీల్ డియో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అడివి శేష్ స్వయంగా ఈ సినిమాకు కథ మరియు స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇది ఇద్దరు మాజీ ప్రేమికుల మధ్య సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీ. గ్రామీణ నేపథ్యంలో జరిగే దోపిడీలు, ప్రతీకారం మరియు భావోద్వేగాల చుట్టూ ఈ కథ సాగుతుంది.ఈ సినిమాను తెలుగు మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించారు. త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.