పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదలకు సర్వం సిద్ధమైంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఎటువంటి కట్స్ లేకుండా ‘యు/ఏ’ (U/A) సర్టిఫికేట్‌ను జారీ చేసింది. సుమారు 2 గంటల 29 నిమిషాల నిడివితో వస్తున్న ఈ చిత్రం, ప్రేక్షకులను అలరించేలా కమర్షియల్ హంగులతో పక్కాగా రూపొందించామని మేకర్స్ చెబుతున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ట్రైలర్ కూడా రెడీ చేశారు. ఈనెల 15న విడుదలచేయాలని చూస్తున్నారు. సుమారు 2 నిమిషాల నిడివి తో కట్ చేసిన ఈ ట్రైలర్ అభిమానులను ఫుల్ ఖుషి చేయనుందని సమాచారం. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఐపీఎస్ ఆఫీసర్ భగత్ సింగ్‌గా పవర్‌ఫుల్ పాత్రలో నటించగా శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటించారు.
అశుతోష్ రాణా, నవాబ్ షా, ఆర్. పార్థిబన్, గౌతమి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ పాటలకు సంగీతం అందించగా, తమన్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టగా, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్‌ను పర్యవేక్షించారు. ఆనంద సాయి ఆర్ట్ డైరెక్టర్‌గా, రామ్-లక్ష్మణ్ ఫైట్ మాస్టర్లుగా పనిచేశారు.
సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు మరియు పాటలకు మంచి స్పందన లభించింది. నిన్న మూడవ పాట ప్రోమోను కూడా విడుదల చేసి ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. రేపు ఫుల్ సాంగ్ రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































