సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘G.O.A.T’ (Greatest Of All Times) విడుదల తేదీ ఖరారు చేశారు.ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి హీరోయిన్గా నటించగా సర్వధమన్ బెనర్జీ, నితిన్ ప్రసన్న, బ్రహ్మాజీ, పృథ్వీ, చమ్మక్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేదవ్యాస్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్ పై చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా మణిశర్మ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్.
ఇది ఒక పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ అని, అదే సమయంలో నేటి యువతను ఆలోచింపజేసే అంశం కూడా ఈ సినిమాలో ఉందని చిత్ర బృందం పేర్కొంది. సుడిగాలి సుధీర్ కెరీర్లో ఈ చిత్రం ఒక మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.మరో రెండు రోజుల్లో ట్రైలర్ విడుదలకానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































