ఓటీటీలోకి భర్త మహాశయులకు విజ్ఞప్తి

Bhartha Mahasayulaku Wignyapthi OTT Release Date Locked

మాస్ మహారాజా రవితేజ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది.సంక్రాంతికి వచ్చిన మిగితా సినిమాలు అన్ని ఇప్పటికే ఓటీటీల్లోకి రాగా భర్త మహాశయులకు మాత్రం ఇప్పటివరకు విడుదలకాలేదు.ఇక ఎట్టకేలకు ఈసినిమా ఓటీటీలోకి రానుంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 13 నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. థియేటర్లలో విడుదలైన దాదాపు 60 రోజుల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాలో రవితేజ ఒక సంపన్న వైన్ వ్యాపారి ‘రామ్ సత్యనారాయణ’ పాత్రలో కనిపిస్తారు. తన వ్యాపార పనుల మీద స్పెయిన్ వెళ్లిన రామ్, అక్కడ ‘మానస శెట్టి’ (ఆషికా రంగనాథ్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే అప్పటికే అతనికి ‘బాలమణి’ (డింపుల్ హయాతి)తో వివాహం జరిగి ఉంటుంది. ఈ ముగ్గురి మధ్య జరిగే భావోద్వేగాల ప్రయాణం మరియు బాధ్యతల చుట్టూ కథ తిరుగుతుంది.

రవితేజసరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి నటించగా సునీల్, వెన్నెల కిషోర్, సత్య, మురళీధర్ గౌడ్, అజయ్ ఘోష్ కీలక పాత్రల్లో కనిపించారు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈసినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా సుధాకర్ చెరుకూరి నిర్మించారు.

ఇక సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ సినిమా, థియేటర్లలో మిశ్రమ స్పందనను రాబట్టుకుంది. అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, కిషోర్ తిరుమల మార్క్ కామెడీ మరియు రవితేజ నటన కోసం ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.