బేబి పెయిర్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. ఈ సినిమా నుండి మొదటి పాట ‘సంచారమే’ ఈరోజే విడుదలయింది. ‘ఖుషి’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను ఆయనే ఆలపించడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రజాకవి గోరేటి వెంకన్న ఈ పాటను రచించడమే కాకుండా, తన గొంతుతో కొన్ని పదాలను ఆలపించి పాటకు మరింత ప్రత్యేకతను చేకూర్చారు. ఊరు వదిలి విదేశాలకు వెళ్లిన వ్యక్తి యొక్క సంతోషాన్ని, ఉత్సాహాన్ని మరియు ఆ ప్రయాణ అనుభవాలను ఈ పాటలో చాలా అందంగా చూపించారు.
90’s వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మే లో ఈసినిమాను విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































