డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకు సంబంధించిన ఫన్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట సినిమా సాటైరికల్ టోన్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పాట హీరో అమెరికన్ డ్రీమ్ ఎలా ఒక్కసారిగా తలకిందులవుతుందో చూపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన డిపోర్టేషన్ నిర్ణయం తర్వాత హీరో జీవితంలో ఏర్పడే గందరగోళ పరిస్థితులను సరదాగా చూపించారు.
ట్రెండీ బీట్స్‌తో రూపొందిన ఈ ర్యాప్ సాంగ్‌ను సంగీత దర్శకుడు స్వీకర్ అగస్తీ స్వయంగా ఆలపించగా, ర్యాప్ పార్ట్స్ అసుర పాడారు. సాహిత్యాన్ని కూడా స్వీకర్ అగస్తి రాయగా, అసురా ర్యాప్ వర్సెస్ అందించారు. పాస్‌పోర్ట్‌పై పడే రిజెక్షన్ స్టాంపులు, ట్రంప్ విగ్రహాలు, “హ్యాపీ డిపోర్టేషన్” కేక్ కట్టింగ్ వంటి సరదా సన్నివేశాలతో పాట వినోదాత్మకంగా సాగుతుంది.
వీడియోలో ఎనర్జీతో నిండిన డ్యాన్స్ మూమెంట్స్, సరదా విజువల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. తరుణ్ భాస్కర్ తన డెడ్‌పాన్ హ్యూమర్‌తో నవ్వులు పండించగా, విష్ణు ఓయి బడ్డీ వైబ్‌ను తీసుకొచ్చారు. టైటిల్‌కు తగినట్లు ఒక సింహం కూడా విజువల్‌గా కనిపిస్తూ కథలోని “గాయపడ్ద సింహం” ను సూచిస్తుంది. స్వీకర్ అగస్తి, అసురా కూడా వీడియోలో కనిపిస్తూ ఫన్ మరింత పెంచారు.
ఈ చిత్రంలో మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా కథానాయికలు కాగా, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
విద్యా సాగర్ చింతా సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషదం ఎడిటింగ్‌న, చంద్రిక గొర్రెపాటి ప్రొడక్షన్ డిజైన్, సూర్య ప్రకాష్ జ్యోసుల కథను అందిస్తున్నారు.ఈ చిత్రం2026 వేసవిలో థియేటర్లలో విడుదల కానుంది.
సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. అందరికీ హాయ్. మీ అందరి ఎనర్జీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ వైబ్ చూస్తుంటే చాలా ఎనర్జీ వస్తోంది. ఈ సాంగ్ మీ అందరికీ నచ్చడం హ్యాపీగా వుంది. కశ్యప్ శ్రీనివాస్ తన కాలేజ్ డేస్ నుంచే చాలా కష్టపడి షార్ట్ ఫిలిమ్స్ తీసి తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో తను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అసలైన హీరో ఈ సినిమాకి ఆయన, ఆయన కథ. కష్టపడ్డ సింహం ఆయన. అదృష్టమైన సింహాన్ని నేను. మా నిర్మాతలకి థాంక్ యు. తప్పకుండా ఈ సినిమాని మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో కలిసి చూడండి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































