ధనుష్ కర విడుదల తేదీ ఖరారు

Dhanush’s Kara Release Date Locked

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కర’ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది.ధనుష్ 54వ చిత్రంగా (D54) తెరకెక్కుతున్న ఈ సినిమా 2026, ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐషారి కె. గణేష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. తమిళం తోపాటు తెలుగు, హిందీ లో కూడా విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘పోర్ తోళిల్’ వంటి సూపర్ హిట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను అందించిన విఘ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.’ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే జయరామ్, సూరజ్ వెంజారమూడు, కేఎస్ రవికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాలో ధనుష్ ‘కరసామి’ అనే పవర్‌ఫుల్ రైతు పాత్రలో కనిపిస్తున్నారు. ఇదొక ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ అని దర్శకుడు ఇప్పటికే స్పష్టం చేశారు.ధనుష్‌కు ఎన్నో హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించినట్లుగా, ఈ సినిమాలోని మొదటి పాట త్వరలోనే విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.