అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్యూట్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘విత్ లవ్’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, సరిగ్గా నెల రోజుల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, మార్చి 6, 2026 నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఇక ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా 25 రోజుల్లో 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా వ్యవహరించారు. స్కూల్ డేస్ నాటి జ్ఞాపకాలు, పాత ప్రేమకథల నేపథ్యంలో సాగే ఈ ఫీల్ గుడ్ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో పంపిణీ చేసింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































