ఎంటర్టైనింగ్ గా మెన్షన్ హౌస్ మల్లేష్ ట్రైలర్

Mension House Mallesh Trailer Promises Full-On Entertainment

శ్రీనాథ్ మాగంటి హీరోగా బాల సతీష్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్. కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలలై ఈ సినిమా ఫస్ట్ సింగిల్, ఫస్ట్ సింగిల్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మెన్షన్ హౌస్ మల్లేష్ ట్రైలర్ ని లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మురళీధర్ గౌడ్ ‘అదొక పెద్ద కథ’ అని చెప్పడంతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. మల్లేష్ క్యారెక్టరైజేషన్, పెళ్లి చూపులు, పెళ్లి తర్వాత జరిగిన సంఘటనలు.. అన్నీ మంచి వినోదాన్ని పంచాయి. డాక్టర్ బ్రాండ్ పేరు అడిగితే ‘జై బాలయ్య’ అని చెప్పడం మాస్ కి మరింత కనెక్ట్ అయ్యింది.

శ్రీనాథ్ మాగంటి మల్లేశ్ పాత్రలో ఒదిగిపోయారు. తను బాడీలాంజ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వున్నాయి. గాయత్రి రమణ పాత్ర కూడా ఎమోషన్ ని యాడ్ చేసింది. మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి పాత్రలు మంచి వినోదాన్ని పంచాయి.

డైరెక్టర్ బాల సతీష్ అందరికీ కనెక్ట్ అయ్యే కథని అద్భుతంగా తీర్చిదిద్దారు. సురేష్ బొబ్బిలి నేపధ్య సంగీతం ప్రతి సీన్ ని ఎలివేట్ చేసింది. అమ్మముత్తు కెమరా వర్క్ కథకి డెప్త్ ని జోడించింది. టెక్నికల్ గా సినిమా మంచి క్యాలిటీతో తీర్చిదిద్దారు. మొత్తానికి ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ మార్చి 6న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.