విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న వివాహం చేసుకున్న శుభసందర్భంగా, వారు నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’ నుండి చిత్ర బృందం ఒక అద్భుతమైన కానుకను అందించింది. ఈ సినిమాలోని మొదటి పాట “ఎందయ్య సామీ” వీడియో సాంగ్‌ను నేడు విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రొమాంటిక్ మెలోడీగా వచ్చిన ఈ సాంగ్ అదిరిపోయింది.ముఖ్యంగా విజువల్స్ క్వాలిటీ నెక్స్ట్ లైవల్లో వుంది.కొత్తగా పెళ్లయిన దంపతులు ఒకరి ప్రపంచంలో ఒకరు ఎలా మునిగిపోతారో ఈ పాటలో చాలా అందంగా చూపించారు. ఈ పాటను శ్వేత మోహన్ మరియు అజయ్ గోగావాలే ఎంతో మధురంగా ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం కొత్త జంట మధ్య ఉండే అనుబంధాన్ని చక్కగా ఆవిష్కరించింది.విజయ్ – రష్మికల కెమిస్ట్రీ వెండితెరపై ఎప్పుడూ ఒక మ్యాజిక్ లా ఉంటుంది. “ఏందయ్య సామీ” పాటలో వారిద్దరినీ చూస్తుంటే ఆ మ్యాజిక్ మళ్ళీ పునరావృతం కాబోతోందని అర్థమవుతోంది.
ప్రముఖ సంగీత ద్వయం అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































