మాస్ కా దాస్ విశ్వక్ సేన్, డైరెక్టర్ అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ఫంకీ’.ఈనెల 13న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈరోజు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ట్రైలర్ ను అనుదీప్ మార్కు “లాజిక్ లేని మ్యాజిక్” కామెడీతో నింపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్రైలర్ ఆద్యంతం అనుదీప్ కేవీ స్టైల్ సెటైరికల్ కామెడీతో నవ్వులు పూయించింది. ఇందులో విశ్వక్ సేన్ ఒక స్ట్రగులింగ్ సినిమా డైరెక్టర్‌గా కనిపిస్తున్నారు. తను తీసే సినిమా ఎంత సిల్లీగా ఉన్నా, దాన్ని ఒక రేంజ్‌లో ఎలివేట్ చేసే పాత్రలో విశ్వక్ ఇరగదీశారు. ముఖ్యంగా అనుదీప్ సినిమాల్లో ఉండే క్యారెక్టరైజేషన్లు, వింతైన సంభాషణలు ఈ ట్రైలర్‌లో మేజర్ హైలైట్‌గా నిలిచాయి.
విశ్వక్ సేన్ తన మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి, ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌లో అదరగొట్టారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. హీరోయిన్ కయాదు లోహర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లోని ఫన్ మోడ్‌ను మరింత పెంచింది.
ట్రైలర్ చూస్తుంటే జాతి రత్నాలు లాగే ఫంకీ కూడా అవుట్ అండ్ అవుట్ క్రేజీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తుంది. షూటింగ్ స్పాట్ లో జరిగే గందరగోళం, ఒక సినిమా తీయడానికి పడే పాట్లు వంటి అంశాలను చాలా కామెడీగా చూపించబోతున్నారు. మొత్తానికి, ‘ఫంకీ’ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది.కామెడీ వర్క్ అవుట్ అయితే విశ్వక్ కెరీర్ లో ఫంకీ బిగ్గెస్ట్ హిట్ గా నిలువనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























