\వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో చేయబోతున్నారు. ఇటీవల విడుదలైన ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మైలురాయిని అందుకోవడంతో, మైత్రీ నిర్మాతలు నవీన్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ధృవీకరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ , జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, తాజాగా ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలతో వరుస హిట్లను అందుకున్న నవీన్, ఇప్పుడు తన మార్కెట్‌ను మరింత పెంచుకునే దిశగా ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఒక అవుట్ అండ్ అవుట్ ఎనర్జిటిక్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా గతంలోనే క్లూ ఇచ్చారు. తాజా విజయంతో ఈ ప్రాజెక్ట్ పనులు వేగవంతం అయ్యాయి.
: నవీన్ పొలిశెట్టి తన ప్రతి సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే మైత్రీ వంటి పెద్ద బ్యానర్‌లో ఆయన చేయబోయే సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరోవైపు, నవీన్ నటించిన ‘అనగనగా ఒక రాజు’ థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ఫిబ్రవరి 11, 2026 నుండి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్‌ను మిస్ అయిన వారు వచ్చే వారం నుండి ఓటీటీలో వీక్షించవచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























