ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సినిమాలు ఓటీటీ ల్లోకి క్యూ కడుతున్నాయి.అందులో భాగంగా ఇప్పటికే నారీ నారీ నడుమ మురారి, ది రాజాసాబ్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుండగా నెక్స్ట్ ప్రేక్షకులను థియేటర్లలో కడుపుబ్బ నవ్వించిన నవీన్ పొలిశెట్టి కామెడీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు డిజిటల్ రిలీజ్ కి సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈసినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమింగ్ కానుంది. కొన్ని నివేదికల ప్రకారం ఫిబ్రవరి 13 అని ప్రచారం జరిగినప్పటికీ, నెట్‌ఫ్లిక్స్ ‘కమింగ్ సూన్’ విభాగంలో ఫిబ్రవరి 11నే లాక్ చేసింది.
ఇక జనవరి 14, 2026న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. సుమారు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి నవీన్ పొలిశెట్టి కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచిందితనకు వరసగా ఇది నాలుగో విజయం.
మారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా.. రావు రమేష్, చమ్మక్ చంద్ర, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























