రీసెంట్ గా ఓం శాంతి శాంతి శాంతిః తో హీరోగా ప్రేక్షకులముందు వచ్చిన టాలెంటెడ్ దర్శకుడు మరియు నటుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’.ఈరోజు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అమెరికా వెళ్లాలని కలలు కనే ఒక యువకుడికి, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి అనే అంశాన్ని ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా చూపించబోతున్నారు. “Don’t Laugh! It’s a Serious Matter!” అనే ట్యాగ్‌లైన్ తో ఈ సినిమా సటైరికల్ డ్రామా గా తెరకెక్కుతుంది.
తరుణ్ భాస్కర్‌కు జోడీగా ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై కొత్తగా ఉండబోతోంది. అలాగే సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ఒక కీలక పాత్రలో మెరవనున్నారు.
ఈ చిత్రానికి యువ దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘సప్త అశ్వ మీడియా వర్క్స్’ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. స్వీకర్ అగస్తీ సంగీతాన్ని అందిస్తుండగా, విద్యాసాగర్ చింతా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా సినిమాపై క్యూరియాసిటీని పెంచిన చిత్ర బృందం, ఈ సినిమా ట్రైలర్‌ను (GPS TRAISER) ఫిబ్రవరి 9, 2026న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. “గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది” అంటూ మేకర్స్ వదిలిన క్యాప్షన్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది.”
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























