కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ (Toxic: A Fairytale For Grown-Ups) తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది.ఈ సినిమా తెలుగు పంపిణీ హక్కులకు సంబంధించిన ఆసక్తికర వివరాలు ఇక్కడ ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC), ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల పంపిణీ హక్కులను రికార్డు ధరకు దక్కించుకుందని సమాచారం.ఈ డీల్ విలువ 120కోట్లు. ఒక నాన్-తెలుగు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి భారీ రేటు పలకడం ఇదే మొదటిసారి.
మూడు ప్రధాన నిర్మాణ సంస్థలు ఈ హక్కుల కోసం పోటీ పడగా, చివరకు దిల్ రాజు ఈ భారీ డీల్‌ను కైవసం చేసుకున్నారు.’కేజీఎఫ్ 2′ తో యష్ మార్కెట్ భారీగా పెరిగిపోయింది. సుమారు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత ఆయన నుండి వస్తున్న సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించబడింది. దీనిని తెలుగు, హిందీ, తమిళం, మలయాళం వంటి పలు ఇతర భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.రీసెంట్ గా విడుదలైన టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
యాక్షన్ సన్నివేశాలను హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ పర్యవేక్షణలో భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.అయితే అదే రోజు ధురంధర్ 2 కూడా విడుదలకానుంది. దాంతో ఈసినిమాకు హిందీ , తెలుగులో భారీ పోటీ ఎదురుకానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























