మృత్యంజయ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Mrityunjay Release Date Locked

గత ఏడాది సింగిల్ తో వచ్చి సాలిడ్ హిట్ కొట్టిన హీరో శ్రీవిష్ణు నెక్స్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ తో రానున్నాడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్ .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాను ఫిబ్రవరి 27, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.’సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీవిష్ణు మరియు రేబా మోనికా జాన్ మరోసారి ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. రేబా జాన్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, శ్రీవిష్ణు పాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది.

‘మీకు మీరే మాకు మేమే’ ఫేమ్ హుస్సేన్ షా కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.కాల భైరవ సంగీతాన్ని సమకూర్చగా, ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందించారు.లైట్ బాక్స్ మీడియా మరియు పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకాపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రం 1990ల నేపథ్యంతో కూడిన ఒక క్రైమ్ థ్రిల్లర్ అని, శ్రీవిష్ణును ఒక సరికొత్త యాంగిల్‌లో చూపిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. విడుదల చేసిన పోస్టర్‌లో శ్రీవిష్ణు న్యూస్ పేపర్ల మధ్య నిలబడి ఉన్న విజువల్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

ఇక ఫిబ్రవరి నెలలో శ్రీవిష్ణు నటిస్తున్న మరో చిత్రం ‘విష్ణు విన్యాసం’ కూడా విడుదలకావాల్సి వుంది.అయితే ఇక ఇప్పుడు మృత్యుంజయ్ రానుండడం తో విష్ణు విన్యాసం వెనక్కి వెళ్లనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.