ఫంకీ ట్రైలర్ డేట్ లాక్ 

Funky Trailer Is Out Now

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకుడు అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ మూవీ ‘ఫంకీ’ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఫంకీ’ థియేట్రికల్ ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లోని శ్రీరాములు 70mm థియేటర్‌లో సాయంత్రం 4 గంటలకు అభిమానుల సమక్షంలో ఈ ట్రైలర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. అదే సమయంలో యూట్యూబ్‌లో కూడా ట్రైలర్ అందుబాటులోకి రానుంది.

వాలెంటైన్స్ వీక్ సందర్భంగా ఫిబ్రవరి 13, 2026న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.ఇందులో విశ్వక్ సేన్ ఒక విభిన్నమైన సినిమా దర్శకుడి పాత్రలో నటిస్తుండగా, ‘డ్రాగన్’ ఫేమ్ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అనుదీప్ కేవీ తనదైన మార్కు సెటైరికల్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో, ఈ ట్రైలర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.