ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ లో సూపర్‌స్టార్ మహేష్ బాబు పోషిస్తున్న పాత్రపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు స్వయంగా ఈ చిత్రంలో తాను రాముడిగా కనిపించబోతున్నట్లు ధృవీకరించారు. రాజమౌళి ప్రతి సినిమా కంటే ఇది పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని, ఇందులో యాక్షన్, అడ్వెంచర్ మరియు టైమ్ ట్రావెల్‌తో పాటు పౌరాణిక అంశాలు కూడా ఉంటాయని ఆయన వెల్లడించారు.రీసెంట్ గా వారణాసి టీం హాలీవుడ్ మీడియాకు వరస ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో భాగంగా ఈ ఇంటర్వ్యూలకు సంబంధించిన క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇంటర్వ్యూలలో ఈ సినిమాలో తన పాత్ర కోసం మహేష్ బాబు పడుతున్న శ్రమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సినిమాలో కేవలం రెండు షాట్ల కోసం తాను ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాముడి పాత్రకు ఉండాల్సిన హుందాతనం, నిలబడే విధానం మరియు నడక కోసం రాజమౌళి ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించారని, దాదాపు మూడు నెలల పాటు దీని కోసమే కష్టపడ్డామని మహేష్ పేర్కొన్నారు. రాజమౌళికి సినిమాపై ఉన్న శ్రద్ధ చూసి తాను మొదట్లో ఈ పాత్ర చేయడానికి భయపడ్డానని, కానీ ఆయన వివరించిన విధానం తనలో నమ్మకాన్ని నింపిందని చెప్పారు.
అలాగే, రాజమౌళికి తన సినిమాల్లో విలన్ పాత్రలంటే చాలా ఇష్టమని, ఆ పాత్రలను ఆయన ఎంతో ప్రేమిస్తారని మహేష్ బాబు సరదాగా గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు ఎవరూ కనీసం మానిటర్ కూడా చూడటం లేదని, అంతా రాజమౌళి పర్యవేక్షణలోనే జరుగుతోందని తెలిపారు. 2024 నుండి ఈ ప్రాజెక్ట్ కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయని, గతేడాది జర్మనీలో కూడా దీని కోసం ప్రత్యేక శిక్షణ పొందామని ఆయన వివరించారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటుతుందని మహేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. అలాగే పోకిరి నన్ను స్టార్ ను చేసిందని అన్నారు.ఆ సినిమా తన కెరీర్ ను మలుపు తిప్పందని గుర్తు చేసుకున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























